![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1105 లో..... ఐశ్వర్య నా దగ్గర అప్పు తీసుకుందని ఒకతను వచ్చి గొడవ చేస్తాడు. ఎంత తీసుకుందని ఇంట్లో వాళ్ళు అడుగగా మూడు లక్షలు అని అతను చెప్తాడు. ఎందుకు ఐషు.. అంత డబ్బు అప్పు చేసావని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. మీ వల్లే చేసానని ఐశ్వర్య చెప్తుంది. నాకు అవసరం ఉంది అంటే ఒక్కరైనా డబ్బు ఇచ్చారా అని ఐశ్వర్య కోప్పడుతుంది. డబ్బు లేదు ఏం లేదు అని ఐశ్వర్య అతనితో గొడవపడుతుంది. మరి కార్ కీస్ ఇస్తే తీసుకొని వెళ్తాను.. కార్ పేపర్స్ పెట్టి డబ్బు తీసుకుందని అతను చెప్పగానే అందరు షాక్ అవుతారు. వేరే దారి లేక ఇందు డబ్బు ఇచ్చి అతన్ని పంపిస్తుంది.
నన్ను కంట్రోల్ చెయ్యాలనుకుంటే ఊరుకోనని ఇందుకి ఐశ్వర్య వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత అతను వెళ్తాడు. అతని వెనకాలే ఐశ్వర్య కూడా వెళ్తుంది. ఎలా యాక్టింగ్ చేసాను మేడం అని అతను డబ్బు అంతా ఐశ్వర్యకి ఇస్తాడు బానే చేసావని అందులో నుంచి ఇరవై వేల రూపాయలు ఇస్తుంది. అతను వెళ్ళిపోతాడు. వెనకాల తిరిగి చూస్తే లక్కీ ఉంటాడు. కన్నింగ్ అని తెలుసు గానీ మరి ఇంత కన్నింగ్ అని తెలియదని లక్కీ అంటాడు. ఏదో ఫస్ట్ టైం చూసినట్లు అలా మాట్లాడుతున్నావ్.. డబ్బు కోసం ఇందుని కిడ్నాప్ చేయమన్నా కదా అని ఐశ్వర్య అంటుంది. సరే ఈ విషయం ఎవరికి చెప్పకని ఐశ్వర్య అనగానే సరే చెప్పను గానీ ముందు నాకు పార్టీ ఇవ్వు అని లక్కీ అంటాడు. అలా అనగానే ఐశ్వర్య సరే ఇస్తానని అంటుంది. మరొకవైపు ఐశ్వర్య గురించి ఇందు బాధపడుతుంది. అప్పుడే రాజు వస్తాడు. ఎందుకు టెన్షన్.. ఇద్దరం కలిసి ఐశ్వర్యని దారిలో పెడుదామని అంటాడు కానీ ముందు మనం ఒకటి చెయ్యాలి లక్కీని రేఖ ఆంటీ కొడుకుగా ఒప్పుకునేలా చేయాలి.. ప్లాన్ సగంలోనే ఆగిపోయిందని రాజు అనగానే దానికోసం ఒక ప్లాన్ ఉంది లక్కీగాడికి పెళ్లిచూపులు ఏర్పాటు చెయ్యాలని రాజు అనగానే ఇందు సరే అంటుంది.
మరొకవైపు వెంకీ అన్న మాటలు గుర్తుచేసుకొని నందు ఏడుస్తుంది వెంకీ కూడా బాధపడుతాడు. లక్ష్మీ వస్తుంది తను బాధపడేలా మాట్లాడాను.. అమ్మ ఎందుకు అంటే తన దారి తను చూసుకుంటుంది కదా అని వెంకీ అంటాడు. ఆ తర్వాత రాజు, ఇందు కలిసి లక్కీ నీకు పెళ్లిచూపులు అని చెప్తారు. ఐశ్వర్యతోనే అని లక్కీ అనుకొని సరే అంటాడు. లక్కీ వెళ్ళాక వాడు మీ అక్కతో అనుకుంటున్నాడు.. వాడి ఫ్లోలో వాడిని ఉండనివ్వమని రాజు అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |